
సహజమైన నటన, ఆకట్టుకునే నవ్వుతో నాని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఆయనంటే ఎంతో ఇష్టం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నానికి అనుకోకుండా హీరోగా మారే అవకాశం వచ్చింది. “అష్టా చమ్మా” సినిమాతో తెరంగేట్రం చేసిన నాని, తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. “ఈగ” సినిమాతో ఆయనకు సూపర్ క్రేజ్ వచ్చింది.
వరుస హిట్ చిత్రాలతో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ నటుడు, మొదట్లో లవర్ బాయ్‌గా కనిపించినా, “దసరా” చిత్రంతో మాస్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నటుడిగానే కాకుండా, నిర్మాతగా మారి తన ప్రతిభను చాటుకుంటున్నారు.
అందరు హీరోలకు నిర్మాతలుగా మారడం సహజమే కానీ, మెగాస్టార్ చిరంజీవి సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తికి ఇది గొప్ప సాధన. తన కెరీర్‌ను విభిన్నమైన మార్గంలో తీర్చిదిద్దుకుంటూ, కొత్త ప్రయోగాలను చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్నారు.
ఇటీవల నాని అసలు పేరు గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అయింది. చాలామందికి నాని అనే పేరుతోనే పరిచయమైనా, ఆయన అసలు పేరు నవీన్ బాబు అని తెలుస్తోంది. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఆయన తన పేరును నానిగా మార్చుకున్నారని సమాచారం.