
విజయ్ దేవరకొండ – సందీప్ రెడ్డి వంగా కలయికలో వచ్చిన “అర్జున్ రెడ్డి” సినిమా సంచలన విజయం సాధించింది. ఈ మూవీతో షాలిని పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ప్రీతి పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అమాయకపు చూపులు, సాఫ్ట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆమెను యూత్‌ఫుల్ హీరోయిన్‌గా నిలబెట్టాయి.
అయితే, “అర్జున్ రెడ్డి” తర్వాత షాలిని పాండే కెరీర్ ఊహించినంతగా ముందుకు సాగలేదు. టాలీవుడ్‌లో కొన్ని యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, అవి ఫ్లాప్స్ అవ్వడంతో ఆమెకు స్ట్రాంగ్ రోల్ దొరకలేదు. దీంతో, టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది.
బాలీవుడ్‌లో మంచి బ్రేక్ కోసం షాలిని పాండే ఫ్యాషన్ ఫోటోషూట్స్ ద్వారా కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఆమె పోస్ట్ చేసే ట్రెండీ డ్రెస్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు ఆమె కెరీర్ గురించి మళ్లీ చర్చలు తెరమీదికి తీసుకొచ్చాయి.
ఇప్పుడు షాలిని పాండేకు బాలీవుడ్ లో మంచి అవకాశాలు రావడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తుందా? లేక బాలీవుడ్ కె ఫుల్ టైమ్ షిఫ్ట్ అవుతుందా? అన్నది చూడాలి.