
సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ మాత్రమే కాదు, అదృష్టం కూడా కీలకం. ఎంతో మందికి టాలెంట్ ఉన్నా, సరైన అవకాశాలు లేక పోతే రాణించడం కష్టమే. కానీ కొందరు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎదుగుతారు. అలాంటి వారిలోనే ఒకరు ఇక్రా అజీజ్.
ఇక్రా అజీజ్ అనే నటి మనకు అంతగా పరిచయం లేకపోయినా, పాకిస్థాన్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. చిన్నతనం నుంచే ఆర్థిక సమస్యలతో పోరాడుతూ, టీవీ షోల ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. తన అసాధారణమైన టాలెంట్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇండస్ట్రీలో అత్యంత సంపన్న నటి గా నిలిచింది.
ఇక్రా 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, తల్లి అండదండలతో ఎదిగింది. “కిస్సే అప్నా కహే” అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించి, ఆపై సినిమాల్లో అవకాశాలు అందుకుంది. పాపులర్ నటుడు, రైటర్ యాసిర్ హుస్సైన్ ను ప్రేమించి, 2019లో పెళ్లి చేసుకుంది. వీరి మధ్య 14 ఏళ్ల వయసు తేడా ఉంది.
ప్రస్తుతం ఇక్రా అజీజ్ పాకిస్థాన్ లో అత్యధిక సంపాదన కలిగిన నటి. నటనా ప్రతిభతోనే సుమారు రూ. 700 కోట్లు సంపాదించిందని టాక్. తన కష్టాన్ని, మిడాస్ టచ్‌ను నిరూపించుకున్న ఈ బ్యూటీ, ఇప్పటికీ పాకిస్థాన్ టాప్ యాక్ట్రెస్ గా కొనసాగుతోంది.