
కన్నడ రాకింగ్ స్టార్ యష్ బాలీవుడ్ భారీ చిత్రం “రామాయణం” షూటింగ్ లో పాల్గొన్నాడు. ఫిబ్రవరి 21 నుంచి ముంబైలోని అక్సా బీచ్‌లో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాస్ట్యూమ్ టెస్ట్ కూడా రెండు రోజులు పూర్తయింది.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రణ్‌బీర్ ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకున్నాడు, ఇక యష్ రావణుడిగా పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ రామాయణం మూవీ గ్రాండ్ విజువల్స్‌తో హాలీవుడ్ స్థాయిలో ఉండనుందని చిత్రబృందం హింట్ ఇచ్చింది. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్యాన్-ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది.
యష్ రావణుడిగా ఎలా కనిపిస్తాడో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో తారాస్థాయిలో ఉంది. ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.