Worst Bollywood Box Office Disaster of 2025
Worst Bollywood Box Office Disaster of 2025

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సినిమాలు భారీ విజయం సాధిస్తూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నాయి. అయితే, ప్రతి సినిమా విజయవంతం అవుతుందా అంటే, అదంతా ప్రేక్షకుల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో ప్లాప్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఓ బాలీవుడ్ సినిమా ఊహించలేని విధంగా దారుణ పరాజయాన్ని చవిచూసింది.

ఈ సినిమా పేరు ఆజాద్. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ కుటుంబానికి చెందిన అమన్ దేవ్‌గన్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తదాని ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అజయ్ దేవ్‌గన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. భారీగా ప్రమోషన్‌లు నిర్వహించినా, సినిమా ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో, ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ చిత్రానికి దాదాపు ₹80 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా, థియేటర్స్‌లో ₹8 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు మొదట్లో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసినా, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. కథనంలో బలహీనత, సీన్స్‌లో ఎంగేజ్‌మెంట్ లేకపోవడం, మోషన్ పిక్చర్ ఎఫెక్ట్స్ లోపించడం వంటి కారణాలతో ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సినిమా భారీగా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో ఇంతవరకు ఇంత భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అవ్వడం చాలా అరుదు. సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఏం సినిమారా బాబూ!” అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ కిడ్స్ ఉంటే సరిపోదు, మంచి కథ, మేకింగ్ కూడా అవసరమనే మరోసారి ఈ సినిమా రుజువు చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *