Ahsaas Channa Childhood to Stardom
Ahsaas Channa Childhood to Stardom

పైన ఉన్న ఫోటోను చూసారా? ఆ చిన్నోడు గుర్తుందా? బాలీవుడ్‌ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన “కభీ అల్విదా నా కెహనా” సినిమాలో చిన్న పిల్లవాడిగా కనిపించిన అహ్సాస్ చన్నా ఇప్పుడు గ్లామర్‌ క్వీన్‌గా మారిపోయింది. చిన్న వయస్సులో బాల నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అహ్సాస్, ఆ తర్వాత హీరోయిన్‌గా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1999 ఆగస్ట్ 5న ముంబైలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన అహ్సాస్ తండ్రి ఇక్బాల్ సింగ్ చన్నా పంజాబీ చిత్ర నిర్మాత, తల్లి కుల్బీర్ బడేస్రాన్ నటి. “వాస్తు శాస్త్రం” (2004) సినిమాలో సుస్మితా సేన్ కొడుకు రోహన్ పాత్ర ద్వారా సినీరంగంలో అడుగుపెట్టి, “మై ఫ్రెండ్ గణేశ్” (2007) సినిమాతో మరింత ప్రాచుర్యం పొందింది. వెబ్ సిరీస్‌లు, టీవీ షోల ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందాలతో హాట్ టాపిక్‌గా మారిన అహ్సాస్ గ్లామర్‌ ఫోటోషూట్లతో కుర్రకారును ఆకర్షిస్తోంది. అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, తన కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. ఆమె నికర విలువ సుమారు ₹10 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం 24 ఏళ్ల ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో మరిన్ని ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నిస్తుండగా, ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్‌గా మారాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *